ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ప్రతి చేనేత కుటుంబానికి రూ.10 వేలు సాయం చేయండి' - చేనేత కార్మికుల సమస్యలపై పవన్ కామెంట్స్

లాక్​డౌన్​తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి చేనేత కుటుంబానికి రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించాలని జనసేనాని పవన్... ప్రభుత్వాన్ని కోరారు. చేనేత వృత్తిపై 2.5 లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వం తెచ్చిన నేతన్న నేస్తం పథకంతో 83 వేల మందికే లబ్ధిచేకూరిందని అన్నారు. చేనేత కార్మికులకు ప్రభుత్వమే జీవనోపాధి చూపాలని పవన్ కోరారు.

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్

By

Published : May 3, 2020, 6:53 PM IST

పవన్ ట్వీట్

చేనేత కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని కోరారు. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమలో ఈ వృత్తిపై ఆధారపడ్డ కుటుంబాలు లక్షల్లో ఉన్నాయన్నారు. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. లాక్​డౌన్ వల్ల నేతన్నకు పూట గడవడమే కష్టంగా మారిందని ఆవేదన చెందారు.

రాష్ట్రంలో చేనేత వృత్తిపై 2.5 లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని పవన్ చెప్పారు. ప్రభుత్వం గత ఏడాది తెచ్చిన నేతన్న నేస్తం పథకంతో 83 వేల మందికే ఆర్థిక సాయం అందిందని వివరించారు. ప్రభుత్వం తక్షణ సాయంగా ప్రతి కుటుంబానికి రూ.10 వేలు సాయం అందించాలన్నారు.

లాక్​డౌన్ అనంతరం చేనేత కార్మికుల జీవనోపాధికి అవసరమైన మార్గాలను ప్రభుత్వమే చూపించాలని కోరారు. నేతన్న నేస్తం పథకాన్ని కొందరికి మాత్రమే పరిమితం చేయకూడదని కోరారు. ఈ వృత్తిపై ఆధారపడ్డవారందరికీ పథకాలు అమలు చేయాలని సూచించారు.

ఇదీ చదవండి:

ప్రేమికులు... ఊపిరి తీసుకున్నారు!

ABOUT THE AUTHOR

...view details