ప్రతిపక్షంలో ఉన్న సమయంలో రాజధానిగా అమరావతిని అంగీకరించిన వైకాపా ఇప్పుడు నిర్మాణాలు ఆపేయడం ఏంటని పవన్ ప్రశ్నించారు. పెద్ద రాజధాని వద్దని భావిస్తే పరిమాణం తగ్గించి 5 వేల ఎకరాల్లో రాజధాని కట్టాలని సూచించారు. అలా కాదని ప్రజామోదం ఉంటే పులివెందులలో రాజధాని ఏర్పాటు చేసినా సంతోషమేనని పవన్ అన్నారు. త్వరలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
'రాజధానిపై త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోండి' - పవన్ కల్యాణ్ తాజా వార్తలు
వైకాపా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి అంగీకరించిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశారు కదా అని ప్రశ్నించారు. ఇపుడు నిర్మాణాలు ఆపివేయడం ఏంటని మండిపడ్డారు. పెద్ద రాజధాని వద్దని భావిస్తే పరిమాణం తగ్గించండన్న పవన్... ఏదో ఒక నిర్ణయం త్వరగా తీసుకోండని ప్రభుత్వానికి సూచించారు.
pawan