ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారికి పాసులు అక్కర్లేదు' - migrant people

లాక్​డౌన్​ నేపథ్యంలో గతంలో తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లాలంటే పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ అవసరం లేదని.. తెలంగాణ పోలీస్​ శాఖ వెల్లడించింది.

'ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారికి పాసులు అక్కర్లేదు'
'ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారికి పాసులు అక్కర్లేదు'

By

Published : Jun 2, 2020, 8:34 PM IST

ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారు ఇక నుంచి డీజీపీ కార్యాలయం నుంచి పాసులు తీసుకోవాల్సిన అవసరం లేదని తెలంగాణ పోలీస్ శాఖ తెలిపింది. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు ప్రయాణించే వారు మాత్రం తమ పేర్లను అక్కడి ప్రభుత్వాల యాప్​లలో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని పోలీసు అధికారులు చెప్పారు.

ఇప్పటి వరకు అంతర్రాష్ట్ర ప్రయాణాలకు డీజీపీ కార్యాలయం ప్రత్యేకంగా పాసులు జారీ చేసేది. దేశ వ్యాప్తంగా లాక్​డౌన్ సడలింపుల్లో భాగంగా అంతర్రాష్ట్ర ప్రయాణాలకు అనుమతినిస్తున్నట్టు కేంద్రం తెలిపింది. ఫలితంగా.. ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణాలకు ట్రాన్స్​పోర్ట్ పాసులను జారీ చేయడాన్ని తెలంగాణ పోలీసు శాఖ నిలిపివేసింది.

తెలంగాణకు వెళ్లే వాహనాలకు కూడా వాహన పాసులను అక్కడి పోలీసులు అడగడం లేదు. ఆంధ్రప్రదేశ్​కు వెళ్లాల్సిన వారు స్పందన యాప్​లో, కర్ణాటక రాష్ట్రానికి వెళ్లేవారు ఆ రాష్ట్రానికి చెందిన సేవా యాప్​లో... మహరాష్ట్రకు వెళ్లే వారు ఆ రాష్ట్ర పోర్టల్​లో తమ పూర్తి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుందని తెలంగాణ పోలీస్ అధికారులు స్పష్టం చేశారు.

ఇవీ చూడండి:

ఈటీవీ భారత్ గ్రౌండ్​​ రిపోర్ట్​: 'కాలాపానీ'పై రగడ ఏల?

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details