రాష్ట్రంలో మొదటి దశ పంచాయతీ ఎన్నికల కోసం అవసరమైతే అదనపు బ్యాలెట్ పత్రాలు ముద్రించేలా ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్లకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ సూచించింది. ప్రాథమిక అంచనాల మేరకు అత్యధిక జిల్లాల్లో ఇప్పటికే బ్యాలెట్ పత్రాలు ముద్రించారు. సర్పంచి, వార్డు సభ్యుల స్థానాలకు అంతకంటే ఎక్కువ మంది బరిలో ఉన్నట్లయితే అప్పటికప్పుడు బ్యాలెట్ పత్రాలు ముద్రించనున్నారు.
అవసరమైతే అదనపు బ్యాలెట్ పత్రాల ముద్రణ... కలెక్టర్లకు ఆదేశం - బ్యాలెట్ పత్రాల ముద్రణ వార్తలు
మొదటి దశ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది. ఎన్నికల కోసం అవసరమైతే అదనపు బ్యాలెట్ పత్రాలు ముద్రించేలా ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్లకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు సూచించాయి.
గతంలో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో నోటా గుర్తు లేదు. దీంతో కనిష్ఠంగా మూడు, గరిష్ఠంగా పది ఎన్నికల గుర్తులతో బ్యాలెట్ పత్రాలు ముద్రించేవారు. సర్పంచి స్థానానికి ఐదుగురు బరిలో ఉంటే పది గుర్తులతో ముద్రించిన బ్యాలెట్ పత్రాన్ని కింది నుంచి చించేసి 5 గుర్తులు తొలగించేవారు. మిగతా 5 గుర్తులతో బ్యాలెట్ పత్రాన్ని పోలింగ్‌కు ఉపయోగించేవారు. పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా నిర్వహిస్తున్నందున బ్యాలెట్ పత్రాలపై అభ్యర్థి పేరు, పార్టీ గుర్తు ఉండవు. అభ్యర్థికి కేటాయించిన సంఖ్య, దానికి ఎదురుగా ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తు ఉంటాయి. ప్రస్తుత ఎన్నికల కోసం రెండు, నాలుగు, ఆరు, ఎనిమిది, పది గుర్తులతో ముద్రించే ప్రతి బ్యాలెట్‌లోనూ చివర్లో నోటా అదనంగా ఉంది. దీంతో కింది నుంచి చించడం సాధ్యం కాదు. అందువల్ల పోటీలో నిలిచేవారి సంఖ్య పెరిగేకొద్దీ కొత్తగా మళ్లీ బ్యాలెట్ పత్రాలు సిద్ధం చేసుకోవాలి.
ఇదీ చదవండి:తొలివిడత నామినేషన్లు: కొన్ని చోట్ల ఒప్పందాలు.. మరికొన్ని ప్రాంతాల్లో విభేదాలు