ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆరోగ్యశ్రీ పరిధిని మరింత విస్తరిస్తూ ఉత్తర్వులు - ఆరోగ్యశ్రీ తాజా వార్తలు

ఆరోగ్య శ్రీ పథకంపై రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చికిత్స అనంతరం ఆర్థిక సాయాన్ని మరికొన్నిటికి విస్తరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం రూ. 60 కోట్ల మేర అదనపు వ్యయం అవుతుందని వెల్లడించింది.

extending the scope of ysr aarogyasri in state
extending the scope of ysr aarogyasri in state

By

Published : Dec 30, 2020, 4:34 PM IST

ఆరోగ్య శ్రీ పథకంలో భాగంగా చికిత్స అనంతరం ఆర్థిక సాయాన్ని మరికొన్నిటికి విస్తరిస్తూ వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా మరో 683 చికిత్సలను వైఎస్సార్​ ఆరోగ్య ఆసరా పథకం కింద చేరుస్తూ వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశాలు ఇచ్చారు.

వైఎస్సార్​ ఆరోగ్య ఆసరా పథకం కింద ప్రస్తుతం 836 చికిత్సలకు చికిత్స అనంతరం ఆర్థిక సాయం పథకాన్ని అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. ఇక నుంచి మరో 683 ప్రోసీజర్లకు ఈ పథకాన్ని అమలు చేయనున్నట్టు స్పష్టం చేసింది. ఇందుకోసం మరో 60 కోట్ల రూపాయల మేర అదనపు వ్యయం అవుతుందని ప్రభుత్వం వెల్లడించింది. కేవలం ఆధార్ తో అనుసంధానమైన రోగుల బ్యాంకు ఖాతాల్లో మాత్రమే చెల్లింపు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ABOUT THE AUTHOR

...view details