ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆర్టీసీ విలీనంపై విధివిధానాలు ఖరారు.. ఉత్తర్వులు జారీ

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియపై కమిటీ విధివిధానాలు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, మొత్తం ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. 9 అంశాలపై అధ్యయనం చేసి అధికారుల కమీటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.

ఆర్టీసీ విలీనంపై విధివిధానాలు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ

By

Published : Oct 11, 2019, 7:45 PM IST

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియపై కమిటీ విధి విధానాలు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, మొత్తం ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం... త్వరితగతిన నివేదిక సమర్పించాలని జీవోలో పేర్కొంది. ఈ మేరకు.. ఆర్టీసీ విలీనం, ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుపై నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం... విలీనం ప్రక్రియలో మిగిలిన అంశాలపై అధ్యయనం చేసి కమిటీ నివేదిక ఇవ్వనుంది. మొత్తం 9 అంశాలపై అధ్యయనం చేయనుంది.

ప్రజా రవాణా వ్యవస్థ ఏర్పాటుపై కమిటీ కీలక సూచనలు చేయనుంది. శాశ్వత ఉద్యోగులు, తాత్కాలిక ఉద్యోగుల జీత భత్యాల సర్దుబాటు ప్రక్రియ సాధ్యాసాధ్యాలపై అభిప్రాయాలు తెలపనుంది. విలీనం తర్వాత ఆర్టీసీ బిజినెస్ రూల్స్​లో మార్పులు రాకుండా తీసుకోవాల్సిన చర్యలు నివేదికలో పొందుపర్చాలని జీవోలో పేర్కొన్నారు. విశ్రాంత ఉద్యోగుల జీతాలు, వైద్య సదుపాయాలపై కమిటీ పరిశీలన చేయనుంది. విలీనం చేయడంలో ఉన్న ఆర్థిక, న్యాయపరమైన అంశాలు పరిగణలోకి తీసుకోనుంది. ఈ పూర్తి వివరాలపై... వచ్చే నెలాఖరుకల్లా నివేదిక సమర్పించాలని కమిటీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ABOUT THE AUTHOR

...view details