కడప జిల్లా ప్రొద్దుటూరులో యువతిపై ప్రేమోన్మాది దాడి చేయటాన్ని పలు పార్టీల నేతలు ఖండించారు.
వైకాపా 20నెలల పాలనలో 350మంది మహిళలు బలయ్యారు. సీఎం సొంత జిల్లాలోనే మహిళలకు రక్షణ లేకుండా పోయిందనటానికి.. లావణ్యపై జరిగిన దాడే ఉదాహరణ. దిశ ఓ దశ లేని చట్టంగా మిగిలింది. దీనిపై గొప్పలు చెప్పుకుంటున్న నేతలకు ప్రేమోన్మాద దాడులు కనిపించడం లేదా ? ఓ మహిళ.. హోం మంత్రిగా ఉన్న రాష్ట్రంలోనే మహిళలపై దారుణాలను అదుపు చేయలేకపోవడం ప్రభుత్వ వైఫల్యమే. - వంగలపూడి అనిత, తెదేపా రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు