ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సరిహద్దులో అంబులెన్సుల అడ్డుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నాం: సోము వీర్రాజు

రాష్ట్ర సరిహద్దులో అంబులెన్సుల అడ్డగింతపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఘాటుగా స్పందించారు. కేసీఆర్ ఈ వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు. సీఎం జగన్ ఈ అంశంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై కేంద్రానికి లేఖ రాస్తామని వెల్లడించారు.

సోము వీర్రాజు
సోము వీర్రాజు

By

Published : May 14, 2021, 4:45 PM IST

తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో అంబులెన్సులను అడ్డుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నామని.. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. హైదరాబాద్ ఒక మెడికల్ హబ్‌గా వెలుగొందుతుందని.. అంబులెన్సులపై కేసీఆర్ మొండి వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు. జగన్ వెంటనే ఈ అంశాలపై స్పష్టత ఇవ్వాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఇప్పటికే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో మాట్లాడానని.. ఇదే విషయంపై కేంద్రానికి లేఖ రాస్తామని సోము వీర్రాజు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details