ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలోని 8 ఆలయాల్లో ఇకపై ఆన్​లైన్​ సేవలు... ఎక్కడెక్కడంటే..? - ఏపీ తాజా వార్తలు

Minister Kottu Satyanarayana: రాష్ట్రంలోని 8 ఆలయాల్లో ఆన్​లైన్​ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈనెల 20 నుంచి ఆన్​లైన్​ సేవలు అందుబాటులోకి రానున్నట్లు మంత్రి సత్యనారాయణ వెల్లడించారు.

Minister Satyanarayana
మంత్రి సత్యనారాయణ

By

Published : Sep 6, 2022, 7:09 PM IST

Updated : Sep 6, 2022, 7:24 PM IST

Minister Kottu Satyanarayana: రాష్ట్రంలో ఎనిమిది ప్రధాన ఆలయాల్లో ఆన్‌లైన్‌ సేవలను ప్రారంభించనున్నట్టు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. కాణిపాకం, శ్రీశైలం, ఇంద్రకీలాద్రి, అన్నవరం, పెనుగంచిప్రోలు, సింహాచలం, వాడపల్లి, అయినవిల్లి ఆలయాల్లో ఈ నెల 20 నుంచి ఆన్‌లైన్‌ సేవల్ని అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే మరో 10 ఆలయాల్లోనూ ఆన్‌లైన్‌ సేవలు కల్పించాలని భావిస్తున్నట్టు చెప్పారు. అక్టోబర్‌ 10న ధార్మిక పరిషత్‌ తొలి సమావేశం జరుగుతుందన్నారు. ఇంద్రకీలాద్రిలో దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయని.. ఉచిత, రూ.300 దర్శనాలకు వచ్చేవారికి ఘాట్‌ రోడ్డు ద్వారా అనుమతించనున్నట్టు మంత్రి వెల్లడించారు. సాధారణ భక్తులకు ఇబ్బంది లేకుండా వీఐపీల కోసం ప్రత్యేక టైం స్లాట్‌ని కేటాయిస్తున్నామన్నారు.

‘‘ఉద్యోగుల పదోన్నతులపై కసరత్తులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ముగ్గురికి డీసీలుగా పదోన్నతి కల్పించాం. అక్టోబర్ 10న ధార్మిక పరిషత్ తొలి సమావేశం నిర్వహిస్తాం. ట్రిబ్యునల్‌లో పెండింగ్‌లో ఉన్న కేసులు పరిష్కారంపై దృష్టి సారించాం. ఇప్పటికే ఛైర్మన్‌ ఉన్నారు. విశ్రాంత ఐఏఎస్‌ పద్మని సభ్యురాలిగా నియమించాం. ప్రతి మంగళవారం దేవాదాయ శాఖపై సమీక్షిస్తున్నాం. దసరా ఉత్సవాలపైనా అధికారులతో మరోసారి సమీక్షించాం. వీఐపీలకు బ్రేక్‌ దర్శనాల కోసం ప్రత్యేక స్లాట్‌ని కేటాయిస్తున్నాం. సామాన్య భక్తులు తెల్లవారుజామున 3గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శనాలకు అవకాశం కల్పిస్తాం. భక్తులెవరికీ అంతరాలయ దర్శనం ఉండదు. ఎమ్మెల్యేకి ఒక సిఫార్సు లేఖ ద్వారా ఆరుగురికి మాత్రమే రూ.500 టిక్కెట్‌ దర్శన భాగ్యం కల్పిస్తాం. రోజుకి 70 వేల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాం. మూల నక్షత్రం రోజున రెండు లక్షల మంది భక్తులు రావచ్చు. వీఐపీల కంటే సామన్య భక్తులకే ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించాం. సీసీ కెమెరాల సంఖ్యను 220 నుంచి 300లకు పెంచుతున్నాం. కేశ ఖండనశాల వద్ద 700 షవర్స్ ఏర్పాటు చేస్తున్నాం. దసరా మహోత్సవాల నిర్వహణకీ ఉత్సవ కమిటీని నియమిస్తాం’’ అని మంత్రి సత్యనారాయణ వివరించారు.

ఇవీ చదవండి:

Last Updated : Sep 6, 2022, 7:24 PM IST

ABOUT THE AUTHOR

...view details