జాతీయ నూతన విద్యా విధానం ద్వారా పరీక్షల విధానంలో కొత్త మార్పులు తీసుకువచ్చింది కేంద్రం. పాఠశాల విద్యలోని 9-10 తరగతుల పరీక్షల్లో ప్రతి సబ్జెక్టుకు రెండురకాల ప్రశ్నపత్రాల విధానం రానుంది. ఒకదానిలో సులభమైనవి, మరోదానిలో ప్రామాణికమైన ప్రశ్నలుంటాయి. తమ ప్రతిభను, ఆసక్తిని బట్టి విద్యార్థులు ఒకదాన్ని ఎంచుకోవచ్చు. ఇప్పటికే సీబీఎస్‌ఈ 2019-20 విద్యాసంవత్సరం నుంచి పదో తరగతి గణితం సబ్జెక్టుకు ఈ విధానాన్ని అమలుచేసింది.
- ఆసక్తి ఉన్న సబ్జెక్టు
దేశవ్యాప్తంగా ఈ విధానాన్ని మొదట గణితం సబ్జెక్టుతో అన్నిబోర్డుల్లో అమలుచేస్తారు. 2022-23 విద్యాసంవత్సరం నుంచి ఈ కొత్త విధానం అమలయ్యే అవకాశముంది. క్రమేణా అన్ని సబ్జెక్టులకు విస్తరిస్తారు. ఆసక్తి లేని సబ్జెక్టులుంటే విద్యార్థులు సులభమైన ప్రశ్నపత్రాన్ని ఎంచుకోవచ్చు. అయితే పాఠ్యాంశాల బోధన మాత్రం అందరికీ ఒకేరకంగా ఉంటుంది.
- రెండు భాగాలుగా ప్రశ్నపత్రాలు
ఇప్పటివరకు పది, ఇంటర్ పరీక్షల్లో అధిక శాతం వ్యాసరూప ప్రశ్నలే ఉంటున్నాయి. దాన్ని మార్చి ప్రశ్నపత్రాన్ని రెండు భాగాలుగా విభజిస్తారు. వ్యాసరూప ప్రశ్నలతోపాటు బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు(ఎంసీక్యూ) ఉంటాయి. వీటన్నిటిపై ఆయా రాష్ట్రాల ఎస్‌సీఈఆర్‌టీలతో సంప్రదించి జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎన్‌సీఈఆర్‌టీ) అవసరమైన మార్గదర్శకాలు రూపొందిస్తుంది.
- ప్రైవేట్ పాఠశాలలూ పాటించాల్సిందే