ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మనసు 'దో(శ)చే' సావిత్రమ్మ టిఫిన్​ సెంటర్​ - అనంతపురంలో రూపాయికే దోసె వార్తలు

ఒక్క రూపాయికే దోశ... ఇదేదో పండగ ఆఫర్ అనుకుంటే పొరపడినట్లే. గత 40 ఏళ్లుగా ఓ అవ్వ కేవలం ఒక్క రూపాయికే దోశ విక్రయిస్తూ ఎందరో ఆకలి తీరుస్తోంది. మరి ఆ దోశ రుచేంటో.. ఆ అవ్వ అంతరంగమేంటో తెలుసుకోవాలంటే... అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని ఏటిగడ్డ పాళ్యం చేరాల్సిందే..!

one-rupee-dosha-in-anantapur-district
one-rupee-dosha-in-anantapur-district

By

Published : Jan 1, 2020, 5:07 PM IST

Updated : Jan 1, 2020, 5:26 PM IST

దోశ... తినాలంటే జేబులో రూ. 20 ఉండాల్సిందే. ఇంకాస్తా పేరున్న సెంటర్​కు వెళ్తే ఇంకో 20 రూపాయలు అదనంగా చెల్లించాల్సిందే. కానీ అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం ఏటిగడ్డ పాళ్యంలోని సావిత్రమ్మ దోశల కేంద్రంలో కేవలం ఒక్క రూపాయికే దోశ దొరుకుతుంది. ఏదో సాదాసీదాగా కాదండోయ్​.. రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపించేంతగా ఉంటుంది ఆ దోశ.

సావిత్రమ్మ టిఫిన్​ సెంటర్​లో ఒక రూపాయికే దోశ

40 ఏళ్లుగా ఒక్క రూపాయికే..

ఏటిగడ్డ పాళ్యం కాలనీకి చెందిన సావిత్రమ్మ 40 ఏళ్లుగా దోశల వ్యాపారం చేస్తోంది.1980 సంవత్సరంలో టిఫిన్​ సెంటర్​ ప్రారంభించిన ఆమె... అప్పట్లో ఒక దోశ 25 పైసలకు అమ్మేది. కొన్నేళ్లకు ధరను 50 పైసలకు పెంచింది. కాలక్రమేణా 50 పైసలు రద్దు కావడం వల్ల రూ.2 రూపాయలకు మూడు దోశలు విక్రయిస్తూ వచ్చింది. గత నాలుగేళ్ళ నుంచి పెరిగిన ధరల దృష్ట్యా.. ఒక రూపాయికి ఒక దోశ ఇవ్వడం మొదలుపెట్టింది. రూపాయికే దోసెతో పాటు రెండు రకాల చెట్నీలు కూడా ఇస్తుంది. దాదాపు రోజుకు 500 దోసెలకు పైగా విక్రయిస్తోంది. అయినా ఆ అవ్వకు రోజుకు మిగిలేది వంద రూపాయిలు మాత్రమే.

ఎదుటివారి ఆకలి తీర్చడమే ఆనందం

ఇంత తక్కువకు దోశలు అమ్మడంపై ఆ అవ్వను కదిలిస్తే.... తన ఖర్చుకు సరిపడా మాత్రమే సంపాదిస్తూ తోటి వారి ఆకలి తీర్చడంలోనే ఎంతో ఆనందం ఉంటుందని చెబుతోంది. స్వలాభం మానుకుని ఎంతో మంది పేద, మధ్య తరగతి వాళ్ల ఆకలి తీరుస్తోన్న సావిత్రమ్మ... స్థానికుల నుంచి మన్ననలు పొందుతోంది.

ఇదీ చదవండి:

రాయలసీమ ముద్దుబిడ్డ జగనన్న.. డిప్యూటీ సీఎం టిక్​ టాక్​

Last Updated : Jan 1, 2020, 5:26 PM IST

ABOUT THE AUTHOR

...view details