హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కిలో బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. షార్జా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు.. బంగారాన్ని అక్రమంగా తీసుకొస్తున్నట్లు అందిన పక్కా సమాచారంతో శంషాబాద్ ఎయిర్పోర్టులో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. లగేజీని తనిఖీ చేయగా పేస్ట్ రూపంలో బంగారం తెచ్చినట్లు గుర్తించి.. స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.43.55 లక్షలుగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
GOLD SEIZE: శంషాబాద్ విమానాశ్రయంలో కిలో అక్రమ బంగారం పట్టివేత - telangana crime news
హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇవాళ కిలో అక్రమ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిన్న దాదాపు అరకిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు.. ఇవాళ కిలో బంగారాన్ని పట్టుకున్నారు.
బంగారం
నిన్న కూడా సుమారు రూ.24 లక్షల విలువైన 495 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి చెప్పులు, ఫేస్ క్రీము, హెయిర్ స్ట్రయిట్‌నర్‌లో దాచుకుని తీసుకురావడాన్ని గుర్తించిన అధికారులు.. ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతన్ని అరెస్ట్ చేశారు.
ఇదీ చదవండి:అక్రమంగా తరలిస్తున్న 15కిలోల బంగారం పట్టివేత