ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Covid Cases: రాష్ట్రంలో ఒకే ఒక కొవిడ్‌ కేసు నమోదు

Covid: రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 2,726 నమూనాలు పరీక్షించగా.. కేవలం ఒకే ఒక కొవిడ్‌ కేసు నమోదైంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

AP Covid Cases
AP Covid Cases

By

Published : Apr 5, 2022, 5:51 AM IST

AP Covid Cases: రాష్ట్రంలో 24 గంటల్లో కేవలం ఒకే ఒక కొవిడ్‌ కేసు నమోదైంది. ఆదివారం ఉదయం 9 నుంచి సోమవారం ఉదయం 9 గంటల మధ్య 2,726 నమూనాలు పరీక్షించారు. వీటి ద్వారా తూర్పుగోదావరి జిల్లాలో ఒకరికి మాత్రమే వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. మిగిలిన జిల్లాల్లో ఒక్క కేసూ నమోదు కాలేదు. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ పేర్కొంది. మరణాలు సంభవించలేదు. 32 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 119 క్రియాశీలక కేసులు ఉన్నాయి. కర్నూలు జిల్లాలో అసలు కేసుల్లేవు. ప్రకాశం, కడప జిల్లాల్లో ఒక్కొక్క క్రియాశీలక కేసు ఉందని పేర్కొంది.

INDIA COVID CASES:దేశంలో కరోనా కేసులు తగ్గుతూ ఉండటం ఊరటనిస్తోంది. కొత్తగా 913 కరోనా కేసులు నమోదయ్యాయి. వెయ్యి కన్నా తక్కువగా రోజువారీ కేసుల సంఖ్య నమోదు కావడం గత 715 రోజుల్లో ఇదే తొలిసారి. 1,316 మంది కోలుకోగా 13 మంది మహమ్మారి ధాటికి ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా భారీగా తగ్గి 0.03 శాతానికి చేరుకుంది. రోజువారీ పాజిటివీ రేటు 0.29 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 98.76 శాతం ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఇప్పటివరకు 1,84,70,83,279 డోసులు పంపిణీ చేశారు. ఆదివారం 2,84,073 మందికి టీకాలు అందించారు. 3,18,823 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

  • మొత్తం కేసులు- 4,30,29,044
  • మరణాలు- 5,21,358
  • యాక్టివ్ కేసులు- 12,597
  • రికవరీలు- 42,495,089

World Corona cases: ప్రపంచవ్యాప్తంగా రోజువారీ కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గింది. తాజాగా 779,220 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కొవిడ్​ కేసుల సంఖ్య 491,564,725 పెరిగింది. మహమ్మారి ధాటికి 1893 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 6,175,811కు చేరింది. ప్రస్తుతం యాక్టివ్​ కేసులు సంఖ్య 58,923,361గా ఉంది. దక్షిణ కొరియా, జర్మనీ, ఫ్రాన్స్ దేశాల్లో కొవిడ్​ ఉద్ధృతి తీవ్రంగా ఉంది.

ఇదీ చదవండి:వికేంద్రీకరణే మా విధానం.. కొత్త జిల్లాలతో ప్రజలకు మెరుగైన పాలన: సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details