కరోనా కారణంగా ఎంసెట్ కు హాజరుకాని విద్యార్థులకు ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. ఏపీ ఎంసెట్ 2020 కు దరఖాస్తు చేసుకుని కొవిడ్-19 సోకిన కారణంగా పరీక్ష రాయలేకపోయినవారు ఈ అవకాశం వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 30,2020తో గడువు తేదీ పూర్తి కానుంది. పరీక్ష తేదీలను త్వరలోనే విడుదల చేయనున్నారు.
పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలనుకున్న విద్యార్థులు తమ హాల్ టికెట్, కరోనా రిపోర్టు, డిక్లరేషన్ ఫామ్‌ను helpdeskeamcet2020@gmail.com కు మెయిల్ చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ sche.ap.gov.in అధికారిక వెబ్సైట్లో దొరుకుతుంది. సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్‌ను ఈ లింక్ ద్వారాను డౌన్లోడ్ చేసుకోవచ్చు. https://sche.ap.gov.in/eamcet/PDF/APEAMCET2020_COVID19_DECLARATION.pdf