ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేడు హైకోర్టు న్యాయమూర్తులుగా ఏడుగురు ప్రమాణం

కొత్తగా నియమితులైన ఏడుగురు హైకోర్టు న్యాయమూర్తులు... ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మొదటి కోర్టు హాల్లో ఉదయం పదిన్నర గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహిస్తారు.

ap high court
ap high court

By

Published : Feb 13, 2022, 7:45 PM IST

Updated : Feb 14, 2022, 1:25 AM IST

కొత్తగా నియమితులైన ఏడుగురు హైకోర్టు న్యాయమూర్తులు... ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మొదటి కోర్టు హాల్లో ఉదయం పదిన్నర గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహిస్తారు. న్యాయమూర్తులుగా నియమితులైన కొనకంటి శ్రీనివాసరెడ్డి, గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, రాజశేఖరరావు, సత్తి సుబ్బారెడ్డి, చీమలపాటి రవి, వడ్డిబోయిన సుజాతతో... హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణం చేయించనున్నారు. ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం రాష్ట్ర హైకోర్టుకు ఏడుగురిని న్యాయమూర్తులుగా సిఫారసు చేసింది. ఆ సిఫారసులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో... ఈమేరకు కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.

Last Updated : Feb 14, 2022, 1:25 AM IST

ABOUT THE AUTHOR

...view details