ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ముగిసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వం

రాష్ట్రంలో రెండు స్థానాల్లో మార్చి 14న.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల గడువు పూర్తి కావటంతో.. నేడు నామినేషన్ల పత్రాలను పరిశీలించనున్నారు.

teachers mlc nominations
ముగిసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వం

By

Published : Feb 24, 2021, 7:23 AM IST

ఏపీలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నామినేషన్లకు ముగిసిన గడువు ముగిసింది. ఏపీలో రెండు స్థానాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు మార్చి 14 తేదీన జరుగనుంది. గుంటూరు-కృష్ణా, తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ స్థానాలకు 23వ తేదీతో నామినేషన్ల పర్వం ముగిసింది. నేడు (24వ తేదీన) అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువు ఫిబ్రవరి 26గా నిర్ధరించారు. మార్చి 14న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. మార్చి 17న ఓట్ల లెక్కింపు చేపడతారు.

గుంటూరు-కృష్ణా స్థానానికి గాను.. 27 నామినేషన్లు దాఖలయ్యాయి. తూర్పు- పశ్చిమగోదావరి ఉపాద్యాయ ఎమ్మెల్సీ స్థానం కోసం 12 నామినేషన్లు దాఖలు చేశారు. ఈ ఎన్నికల కోసం గుంటూరు జిల్లాలో 59, కృష్ణా జిల్లాలో 51 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. 13,121 మంది ఉపాధ్యాయులు ఓటు హక్కు వినియోగించు కోనున్నారు.

ఇదీ చదవండి:ఎయిడెడ్‌ విద్యా సంస్థలను ప్రభుత్వమే తీసుకుంటుంది.. అంగీకరించకపోతే?

ABOUT THE AUTHOR

...view details