హింసను ప్రేరేపించేలా మాట్లాడిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై.. డీజీపీ కేసు నమోదు చేయగలరా అని తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. చంద్రబాబుపై ఎవరైనా దాడి చేస్తే తమ బాధ్యత కాదని సజ్జల అనడం.. రౌడీలను రెచ్చగొట్టడమేనని ధ్వజమెత్తారు. తెదేపా ప్రభుత్వ హయాంలో చంద్రబాబును తీవ్ర పదజాలంతో జగన్ దూషించినా.. పార్టీ నాయకులెవరూ రెచ్చగొట్టలేదని గుర్తు చేశారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా రెండేళ్ల పాటు జగన్ పాదయాత్ర చేసిన విషయం ప్రస్తావించారు.
'సజ్జల వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయి' - tdp fires on sajjala
భాష, సంప్రదాయాల గురించి సజ్జల మాట్లాడటం విడ్డూరంగా ఉందని తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఎద్దేవా చేశారు. చంద్రబాబుపై ఎవరైనా దాడి చేస్తే తమ బాధ్యత కాదని సజ్జల అనడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
nimmala ramanaidu comments on sjjala rama krishna reddy
చంద్రబాబుని నడిరోడ్డుపై కాల్చేయాలని, బంగాళాఖాతంలో కలపాలని అప్పట్లో జగన్ మాట్లాడింది.. సంస్కారవంతమైన భాషేనా అని ప్రశ్నించారు. భాష, సంప్రదాయాల గురించి సజ్జల మాట్లాడటం విడ్డూరంగా ఉందని నిమ్మల ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి:ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన వైకాపా