తెలంగాణలోని 5 జిల్లాల్లో ఎన్‌ఐఏ సోదాలు (NIA Raids) నిర్వహించింది. దుమ్ముగూడెం మావోయిస్టు ఆయుధ, పేలుడు పదార్థాల కేసు (Case of Explosive)లో తనిఖీలు నిర్వహించినట్లు ఎన్‌ఐఏ (NIA) వెల్లడించింది. మహబూబ్నగర్, వరంగల్, జనగామ, భద్రాద్రి, మేడ్చల్ జిల్లాల్లో సోదాలు నిర్వహించారు. మహబూబ్నగర్ జిల్లాలోని ముత్తు నాగరాజు, వి. సతీశ్ ఇళ్లలో సోదాలు చేశారు. మేడ్చల్లోని కొమ్మరాజు కనకయ్య ఇంట్లో... భద్రాద్రి జిల్లాలోని గుంజి విక్రమ్, త్రినాథరావు ఇళ్లల్లో... జనగామలో సూరసారయ్య, వరంగల్‌లో వేలుపు స్వామి ఇళ్లలో తనిఖీలు చేశారు.
NIA RAIDS: తెలంగాణలో ఎన్‌ఐఏ సోదాలు...పేలుడు పదార్థాలు స్వాధీనం - తెలంగాణలో ఎన్‌ఐఏ సోదాలు
21:55 July 19
NIA
ఈ దాడుల్లో 400 ఎలక్ట్రిక్ డిటోనేటర్లు (Electric Detonators), 500 నాన్ ఎలక్ట్రిక్ డిటోనేటర్ల (Non-Electric detonators)తో పాటు 400 జిలెటిన్ స్టిక్స్ (Gelatin sticks), 549 మీటర్ల ఫ్యూజ్ వైర్లు (Fuse wires) స్వాధీనం చేసుకున్నారు. ఐఈడీ, గ్రనేడ్ లాంఛర్ల తయారీకి అవసరమైన సామగ్రి గుర్తించామని... పేలుడు పదార్థాల తయారీకి సంబంధించిన పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌ఐఏ పేర్కొంది. ఈ పేలుడు పదార్థాలను మావోయిస్టు నేత హిడ్మా (Maoist Leader Hidma )కు ఇచ్చేందుకు తీసుకెళ్తుండగా పట్టుకున్నామని ఎన్‌ఐఏ వెల్లడించింది.
ఇదీ చదవండి
CM Jagan Polavaram Tour: ఏదో కట్టాం అన్నట్టు పునరావాస కాలనీలు ఉండొద్దు: సీఎం జగన్