ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

LOAN APPS: లక్ష పెట్టుబడి పెడితే రోజుకు రూ.5 వేలు ఇస్తామంటూ.. - fake mal 008 app news

రుణ యాప్‌ల పేరుతో జరిగిన మోసాలకు అధికారులు చెక్‌ పెట్టగా.. ఇప్పుడు అంతకుమించి మరో పన్నాగం పన్నారు చైనీయులు. పెట్టుబడి పేరుతో సరికొత్త మోసాలకు తెరలేపారు. ఒక యాప్‌ రూపొందించి... అందులో లక్ష మదుపు చేస్తే రోజుకు 5 వేల చొప్పున ఖాతాలో జమ చేస్తామంటూ నమ్మించి మోసాలు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం అరెస్టయిన ఇద్దరు వ్యక్తులను విచారించగా... కీలక వివరాలు వెలుగుచూశాయి.

new-type
new-type

By

Published : Aug 10, 2021, 9:11 AM IST

ఒకటి కాకపోతే మరొకటి.. ఒక దానికి మించి ఇంకొకటి. చైనీయులు కొత్త దారుల్లో ఆర్థిక నేరాలు చేస్తూ మరోసారి తెరపైకి వచ్చారు. రుణ యాప్‌ల పేరుతో కోట్లు కొల్లగొట్టి... ఇప్పుడు వాటిపై నిఘా పెరగడంతో కొత్త దారి ఎంచుకున్నారు. లక్ష పెట్టుబడి పెడితే రోజుకు 5 వేలు ఇస్తామని నమ్మించి మోసాలకు తెగబడుతున్నారు.

నెల రోజుల్లోనే రూ.50 కోట్ల లావాదేవీలు..

చైనాకు చెందిన మైఖేల్‌, జోలీలు... ఈ ఏడాది జనవరిలో ఓ కంపెనీని ప్రారంభించి.. శ్రీనివాస్‌రావు, విజయ్‌కృష్ణ అనే ఇద్దరిని డైరెక్టర్లుగా పెట్టుకున్నారు. ఇద్దరికీ నెలకు 15 వేలు జీతం ఇస్తామని పనిలో కుదిర్చారు. వారి బ్యాంకు ఖాతాలను తీసుకొని యాప్ ద్వారా కొల్లగొట్టిన నగదును వీరి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయించి బదిలీ చేయించుకున్నారు. ఇలా నెల రోజుల్లోనే రూ.50 కోట్ల లావాదేవీలు నిర్వహించారని గుర్తించారు.

నిఘా వర్గాల సమాచారం..

మార్చిలో బెంగళూరులో పవర్ బ్యాంక్, మై బ్యాంక్ పేరుతో యాప్‌లను సృష్టించి మోసాలు చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు బెంగళూరు పోలీసులు రెండు నెలల క్రితం ఒక చైనా యువతి, ఇద్దరు టిబెటన్లను అరెస్ట్ చేశారు. రెండు నెలల్లో వీరు రూ.300 కోట్లు కొల్లగొట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఉత్తరాఖండ్ పోలీసులు జూన్​లో 12 మందిని అరెస్ట్ చేయగా వారిలో ఇద్దరు చైనీయులున్నారు. అక్కడా రెండు నెలల్లో రూ. 350 కోట్లు కొట్టేశారు. దేశభద్రతకు ముప్పుగా పరిణమించే అంశమని భావించిన ఉత్తరాఖండ్ పోలీసులు ఈ విషయమై కేంద్ర నిఘా వర్గాలు దర్యాప్తు సంస్థలకు సమాచారం అందజేశాయి.

మాల్ 008 యాప్ ద్వారా మోసాలు..

యాప్‌ల ద్వారా రుణాలిస్తున్న చైనీయులను స్ఫూర్తిగా తీసుకొని.. అదే దేశానికి చెందిన మరికొందరు.. హైదరాబాద్, బెంగళూరు, దిల్లీలకు చేరుకొని కాల్ సెంటర్లను ఏర్పాటు చేశారు. మైకేల్, జోలీలు రెండేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి... తాయ్ మౌంట్ పేరుతో స్థానికంగా ఓ కాల్ సెంటర్‌ను ప్రారంభించారు. యాప్‌ల ద్వారా రుణాలివ్వడం మొదలు పెట్టారు. ఈ కాల్ సెంటర్‌లోనే శ్రీనివాసరావు, విజయ్ కృష్ణ పనిచేసేవారు. రుణాలిస్తున్నామని వారికి తెలియకుండా చూసుకున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు గతేడాది డిసెంబరులో చైనాకు చెందిన ల్యాంబోను అరెస్ట్ చేయడంతో తమనూ పట్టుకుంటారన్న అనుమానం వచ్చి పెట్టుబడి పేరుతో మోసం చేయడం ప్రారంభించారు. ఈ ఏడాది జనవరిలో చైనాకు వెళ్లిపోయారు. అక్కడి నుంచి మాల్ 008 యాప్ ద్వారా మోసాలు ప్రారంభించారు.

ఇదీచూడండి:Loan Apps Case : నగదు బదిలీలో బ్యాంక్ అధికారుల హస్తం!

ABOUT THE AUTHOR

...view details