ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఐఐసీటీ తయారు చేసిన సరికొత్త మాస్కులు - New masks made by iict

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ(ఐఐసీటీ) శాస్త్రవేత్తలు సరికొత్త మాస్కును తయారుచేశారు. ఈ ‘సాన్స్‌ ఫేస్‌మాస్కు’ను 30 సార్లు ఉతికి తిరిగి వాడుకోవచ్చని.. రెండు మూడు నెలల వరకు పనికొస్తుందన్నారు.

New masks made by iict
ఐఐసీటీ తయారు చేసిన సరికొత్త మాస్కులు

By

Published : Aug 5, 2020, 1:11 PM IST

మాస్కు లేనిదే గడపదాటలేని పరిస్థితి. ప్రతిసారి కొత్త మాస్కు కొనాలంటే కుటుంబసభ్యులందరికీ కలిసి ఖర్చు భారీగా అవుతోంది. ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు ఐఐసీటీ శాస్త్రవేత్తలు సరికొత్త మాస్కును తయారు చేశారు.

మూడు, నాలుగు పొరలు కలిగి హైడ్రోఫోబిక్‌ పాలిమర్లతో బ్యాక్టీరియా, వైరస్‌లను సమర్థంగా నిలువరించేలా దీన్ని రూపొందించారు. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, మాట్లాడేటప్పుడు వెలువడే తుంపర్లలో 0.3 మైక్రాన్ల పరిమాణం వరకు ఈ మాస్కు నిలువరిస్తుంది. గరిష్ఠంగా 60 నుంచి 70 శాతం వరకు వైరస్‌ను అడ్డుకుంటుందని ఐఐసీటీ సీనియర్‌ ప్రిన్సిపల్‌ శాస్త్రవేత్త, ప్రాజెక్టు డైరెక్టర్‌ శ్రీధర్‌ తెలిపారు.

ఈ ‘సాన్స్‌ ఫేస్‌మాస్కు’ను 30 సార్లు ఉతికి తిరిగి వాడుకోవచ్చని.. రెండు మూడు నెలల వరకు పనికొస్తుందన్నారు. పెద్దఎత్తున మాస్కుల ఉత్పత్తికయ్యే వ్యయాన్ని భరించేందుకు సిప్లా ఫౌండేషన్‌ ముందుకొచ్చిందని ఐఐసీటీ ప్రధాన శాస్త్రవేత్త డి.శైలజ తెలిపారు. సిప్లా ప్రతినిధులతో కలిసి సంస్థ డీజీ శేఖర్‌ మండే మంగళవారం ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ఐఐసీటీ డైరెక్టర్‌ ఎస్‌. చంద్రశేఖర్‌, సిప్లా ఫౌండేషన్‌ మేనేజింగ్‌ ట్రస్టీ రుమానా హమీద్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:ఐఎస్​బీతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం

ABOUT THE AUTHOR

...view details