ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 1,728 కరోనా కేసులు, 9 మరణాలు నమోదు - తాజా వార్తలు

రాష్ట్రంలో గురువారం కొత్తగా 1,728 కరోనా కేసులు, 9 మరణాలు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,49,705కు చేరగా... మృతుల సంఖ్య 6,837కు పెరిగింది.

new corona cases in andhrapradhesh
రాష్ట్రంలో కొత్తగా 1,728 కరోనా కేసులు, 9 మరణాలు నమోదు

By

Published : Nov 12, 2020, 6:45 PM IST

రాష్ట్రంపై కరోనా ప్రభావం కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో.. 70 వేల 405 మందికి కరోనా నిర్థరణ పరీక్షలు చేయగా.. 1728 మందికి వైరస్ సోకినట్టు ఫలితాలు వచ్చాయి. వీటితో కలిపి.. రాష్ట్రంలో కోవిడ్ బాధితుల సంఖ్య.. 8,49,705కు పెరిగింది. మరోవైపు.. గడచిన 24 గంటల్లో కోవిడ్ కారణంగా 9 మంది చనిపోయారు. వీరితో కలిపి మృతుల సంఖ్య.. 6,837కు చేరింది.

జిల్లాల వారీగా కేసుల వివరాలు

తాజాగా.. 1761 మంది బాధితులు కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య.. 8.20 లక్షలకు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 20,915 యాక్టివ్ కేసులు ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ.. తాజా కరోనా బులెటిన్ లో వెల్లడించింది.

ABOUT THE AUTHOR

...view details