ఉద్యోగులకు శాఖాపరమైన పరీక్షల్లో నెగెటివ్ మార్కులను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు డిపార్ట్ మెంటల్ పరీక్షా నిబంధనలు 1965ని సవరిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించే శాఖాపరమైన పరీక్షల్లో ఇక నుంచి నెగెటివ్ మార్కింగ్ ఉండబోదని స్పష్టం చేస్తూ ఆదేశాలు ఇస్తూ.. సాధారణ పరిపాలన శాఖ సర్వీసుల విభాగం ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఉద్యోగులకు శాఖాపరమైన పరీక్షల్లో నెగెటివ్ మార్కులు రద్దు - ఏపీ తాజా వార్తలు
ఏపీ ఉద్యోగులకు శాఖాపరమైన పరీక్షల్లో నెగిటివ్ మార్కులను రద్దు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించే శాఖాపరమైన పరీక్షల్లో ఇక నుంచి నెగెటివ్ మార్కింగ్ ఉండబోదని స్పష్టం చేసింది.
negative marking removed