ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'నవ్వుల పాలైన తెలుగువారు'.. చంద్రబాబు ఆవేదన! - navvulapalaina telugu varu video news

'నవ్వుల పాలైన తెలుగువారు' పేరిట తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మరో వీడియోను విడుదల చేశారు. పాలకులు బాధ్యతగా ప్రవర్తిస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని హితవు పలికారు.

'నవ్వుల పాలైనా తెలుగువారు' పేరిట మరో వీడియో విడుదల చేసిన చంద్రబాబు
'నవ్వుల పాలైనా తెలుగువారు' పేరిట మరో వీడియో విడుదల చేసిన చంద్రబాబు

By

Published : Jun 2, 2020, 7:44 PM IST

Updated : Jun 2, 2020, 9:13 PM IST

చంద్రబాబు ట్వీట్

'నవ్వుల పాలైన తెలుగువారు' పేరిట తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మరో వీడియో విడుదల చేశారు. ప్రస్తుత ప్రభుత్వ తీరుతో తెలుగువాళ్లు దేశ విదేశాల్లో నవ్వులపాలయ్యారని మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వాన్ని చూసి బిహర్ ఆఫ్ సౌత్, గవర్నమెంట్ టెర్రరిజం అంటున్నారని విమర్శలు గుప్పించారు. ఈ ప్రభుత్వ చర్యలతో రాష్ట్రంలో రివర్స్ పాలన సాగుతోందన్న ఆయన.. రివర్స్ టెండరింగ్, పీపీఏలు, రాజధానులు, మండలి రద్దు వ్యవహారాలపై మండిపడ్డారు.

చంద్రబాబు ట్వీట్

రాష్ట్ర ప్రభుత్వ తీరుతో దేశానికే పెట్టుబడి రాని దుస్థితి నెలకొందని తెలిపారు. వాటాల కోసం బెదిరించి పెట్టుబడిదారులను తరిమేశారని ఆరోపించారు. రాష్ట్రాన్ని వేధింపులకు వేదికగా చేశారని మండిపడ్డారు. పాలకులు బాధ్యతగా ప్రవర్తిస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని... ఇలాంటి చేతగాని పాలకులైతే రాష్ట్రం నవ్వుల పాలే అని విమర్శించారు. విభజన తర్వాత రూ.16,000 కోట్ల లోటు బడ్జెట్ లో కూడా ఆంధ్రప్రదేశ్, తెలుగుదేశం పాలనలో తలెత్తుకునేలా ఎదిగిందని గుర్తు చేశారు.

చంద్రబాబు ట్వీట్

5ఏళ్లు వరుసగా రెండంకెల అభివృద్ధిని సాధించిందని చెప్పారు. తెలుగుదేశం పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం... పెట్టుబడులకు గమ్యస్థానంగా ఉందని, అనేక రంగాలలో దేశంలో నెంబర్ 1 గా నిలిచిందని చెప్పారు. 5 ఏళ్ల పాలనలో ఏపీ 667 అవార్డులను సాధించిందని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.

చంద్రబాబు ట్వీట్

ఇదీ చదవండి:

తిరుమల శ్రీవారి దర్శనానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి

Last Updated : Jun 2, 2020, 9:13 PM IST

ABOUT THE AUTHOR

...view details