ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన ఇంటర్ విద్యార్థికి లోకేశ్ అండ - తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్

కోవిడ్ సోకి తాతయ్య, తండ్రిని కోల్పోయిన ఇంటర్ విద్యార్థి చెరుకూరి లోకేశ్ కృష్ణకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అండగా నిలిచారు. అతని పై చదవులకు అవసరమైన సహాయాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. ఇంటర్ పరీక్షల వాయిదాపై ఇటీవల లోకేశ్ నిర్వహించిన ఆన్లైన్ సమావేశంలో ఆ విద్యార్థి పాల్గొని అభిప్రాయాన్ని పంచుకున్నాడు.

నారా లోకేశ్
నారా లోకేశ్

By

Published : May 13, 2021, 4:57 PM IST

కోవిడ్ కారణంగా తాతయ్య, తండ్రిని కోల్పోయిన ఇంటర్మీడియట్ విద్యార్థి చెరుకూరి లోకేశ్ కృష్ణకు అండగా నిలుస్తానని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. ఉన్నత చదువులు అభ్యసించేందుకు సాయం అందిస్తానని ప్రకటించారు.

ఇంటర్ పరీక్షల వాయిదాపై ఇటీవల నిర్వహించిన ఆన్లైన్ సమావేశంలో విద్యార్థి లోకేశ్ కృష్ణ పాల్గొన్నాడు. అతని తాతయ్య మల్లిఖార్జున రావు ఈ నెల 7న, తండ్రి వెంకటసుబ్బయ్య 9న కరోనాతో చికిత్స పొందుతూ మరణించారు. విషయం తెలుసుకున్న లోకేశ్ విద్యార్థితో ఆన్లైన్ ద్వారా స్వయంగా మాట్లాడారు. పై చదువులు చదివేందుకు అవసరమైన సాయం చేస్తానని భరోసా ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details