'ఒక రాష్ట్రం - ఒకే రాజధాని' నినాదంతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళుతామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఒకే రాజధాని అన్న భావన ప్రజల్లో ఉందని తెలిపారు. రాజమహేంద్రవరంలో మాట్లాడిన లోకేశ్... నాడు అమరావతికి మద్దతు తెలిపి మాట తప్పం, మడం తిప్పం అన్న వారు నేడు ఏమైపోయారని ప్రశ్నించారు. 2015లోనే రాజధానిగా అమరావతిని నోటిఫై చేస్తూ కేంద్రం ప్రకటన చేసిందని గుర్తు చేశారు. రాజధానిపై రాష్ట్రానికి నిర్ణయం ఉంటుందనే విషయాన్ని కేంద్రం చెప్పిందని... కానీ రాజధానులపై కాదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారని లోకేశ్ ఆరోపించారు.
'రాజధాని అనే చెప్పింది... రాజధానులు అని కాదు'
ఒక రాష్ట్రం - ఒకే రాజధాని నినాదంతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చెప్పారు. 2015లోనే అమరావతిని రాజధానిగా కేంద్రం నోటిఫై చేసిందని గుర్తు చేశారు.
Nara Lokesh On Amaravathi