మహిళలు, యువత, విద్యార్థులకు అండగా నిలవడమే లక్ష్యంగా అనుబంధ సంఘాలు పనిచేయాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సూచించారు. తెదేపా అనుబంధ సంఘాలను బలోపేతం చేస్తున్నామని, సెప్టెంబర్ నెలాఖరు నాటికి అన్ని సంఘాలకు పూర్తి రాష్ట్ర కార్యవర్గాలు ఏర్పాటు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. తెదేపా రాష్ట్ర కార్యాలయంలో తెలుగు యువత, టీఎన్ఎస్ ఎఫ్, తెలుగు మహిళ సంఘాల ప్రతినిధులతో లోకేశ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అనుబంధ సంఘాల పనితీరు, బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత గురించి చర్చించారు.
తెదేపా అనుబంధ సంఘాల్లో మహిళలకే ప్రాధాన్యం:లోకేశ్ - amaravathi
వచ్చే నెలలో వేయనున్న తెదేపా అనుబంధసంఘాల కార్యవర్గాలు ఎలా ఉండాలనే దానిపై నారా లోకేశ్ సమావేశం నిర్వహించారు. తెలుగు యువత, విద్యార్థి, మహిళా సంఘాల కార్యవర్గాలలో ఎక్కువగా మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సెప్టెంబర్ నెలాఖరు నాటికి అన్ని సంఘాలకు పూర్తి రాష్ట్ర కార్యవర్గాలు ఏర్పాటు చేయాల్సిందేనని స్పష్టం చేశారు.
మహిళలకే ప్రాధాన్యం...
వచ్చే నెలలో వేయనున్న అనుబంధసంఘాల కార్యవర్గాలు ఎలా ఉండాలనే దానిపై సమావేశంలో చర్చించారు. టీఎన్ఎస్ఎఫ్ లో సభ్యులుగా చేరాలన్నా, కార్యవర్గంలో ఉండాలన్నా తప్పనిసరిగా విద్యార్థి అయి ఉండాలని లోకేష్ నిర్దేశించారు. వయస్సు 35కి మించని వారే టీఎన్ఎస్ఎఫ్లో చేరేందుకు అర్హులని నిర్ణయించారు. తెలుగు యువత, విద్యార్థి, మహిళా సంఘాల కార్యవర్గాలలో ఎక్కువగా మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. వినూత్నమైన పోరాట పంథాతో ప్రజాసమస్యలపై ఉద్యమించాలని కోరారు.
ఇవీ చూడండి-అన్యాయాన్ని ప్రశ్నిస్తే... అక్రమ కేసులా..?