రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ దౌర్జన్యకాండ కొనసాగుతోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "వైకాపా గూండాలు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. కర్నూలు జిల్లా మండిగిరిలో వైకాపా నేత కల్లుబోతు సురేష్.. గ్రామ సచివాలయ ఉద్యోగులపై దుర్భాషలాడుతూ... భౌతికదాడి చేశాడు" అని లోకేశ్ ఆరోపించారు.
చెప్పిన పని చెయ్యలేదని ప్రభుత్వ ఉద్యోగి చెంప పగలకొట్టడానికి ఎంత ధైర్యమని నిలదీశారు. "అధికార మదంతో వైకాపా నాయకుల కళ్లు నెత్తికెక్కాయి" అని మండిపడ్డారు. ఏవోపై దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని లోకేశ్ డిమాండ్ చేశారు. దాడికి సంబంధించిన వీడియోను ట్విటర్లో పెట్టారు. ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ కల్పించాలన్నారు.