విశాఖటపట్టణం అనధికారికంగా విజయసాయిరెడ్డి పట్టణమైందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యంగం నడుస్తోందన్న ఆయన.. స్థలం ఖాళీ చేయకపోతే జేసీబీలతో విధ్వంసం సృష్టిస్తున్నారని చెప్పారు. పెదవాల్తేరులో మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి విద్యాబుద్దులు నేర్పిస్తున్న పాఠశాలను కబ్జా చేయాలని చూశారని ఆరోపించారు.
ఖాళీ చేయకుంటే.. జేసీబీలతో విధ్వంసం సృష్టిస్తున్నారు: లోకేశ్ - తెదేపా నేత నారా లోకేశ్ వార్తలు
స్థలం కనిపిస్తే చాలు.. వైకాపా నేతలు కబ్జా చేయడానికి చూస్తున్నారని తెదేపా నేత నారా లోకేశ్ విమర్శించారు. ఖాళీ చేయకపోతే జేసీబీలతో విధ్వంసం సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు.
nara lokesh