ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Lokesh: 'మాస్క్ పెట్టుకోకుంటే చంపేయాలని వైకాపా సెక్షన్లు చెబుతున్నాయా?' - దళిత యువకుడిని చంపిన వారిపై చర్యలేవని ప్రశ్నించిన లోకేశ్

మాస్క్ పెట్టుకోని వాళ్లను కొట్టి చంపాల‌ని జ‌గ‌న్‌ స‌ర్కారు చెబుతోంద‌ని అర్థం చేసుకోవాలా... అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. మాస్కు పెట్టుకోలేదన్న విషయంలో.. దళిత యువకుడిని పోలీసులు కొట్టి చంపి ఏడాదైనా... నిందితులపై చర్యలేవని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు.

nara lokesh fires on govt over not taken action on dalit murder at nellore
మాస్కు పెట్టుకోలేదని దళితుడిని చంపిన వారిపై చర్యలేవీ

By

Published : Aug 1, 2021, 7:29 PM IST

నెల్లూరు జిల్లా చేజర్ల మండలం ఆదూరుపల్లి సెంటర్‌లో.. మాస్క్ పెట్టుకోలేదని ఓ వ్యక్తిని ఎస్ఐ చిత‌క‌బాది చంపేవ‌ర‌కూ వెళ్లాడని ట్విట్టర్​లో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. ట్విటర్ లో మండిపడ్డారు. కొడుతూ, కాలితో తంతూ ఇష్టారీతిన వ్యవ‌హ‌రించారని ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే... మాస్క్ పెట్టుకోలేదని చీరాల‌లో ద‌ళిత‌ యువ‌కుడు కిరణ్ కుమార్‌ను పోలీసులు కొట్టి చంపి ఏడాది దాటినా.. నిందితుల‌పై ఇప్పటికీ చ‌ర్యలు తీసుకోలేదని దుయ్యబట్టారు.

మాస్క్ పెట్టుకోని వాళ్లను కొట్టి చంపాల‌ని జ‌గ‌న్‌ స‌ర్కారు చెబుతోంద‌ని అర్థం చేసుకోవాలా... అని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వైకాపా సెక్షన్ ప్రకారం మాస్క్ పెట్టుకోక‌పోవ‌డం చంపేసేంత నేర‌మైతే.. ముఖ్యమంత్రి ఏ ఒక్కరోజూ మాస్క్ వేసుకోకుండా తిరిగితే ఆయ‌న‌కి వైకాపా సెక్షన్లు వ‌ర్తించ‌వా అని డీజీపీని నిలదీశారు.

ABOUT THE AUTHOR

...view details