జగన్ మోసపు రెడ్డి మాటలు కోటలు దాటతాయే కానీ.. చేతలు తాడేపల్లి ప్యాలెస్ కాంపౌండ్ కూడా దాటవని తెదేపా జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారం ఇవ్వడమేంటని జగన్ ప్రశ్నించారన్న లోకేశ్.. ఇప్పుడు చిత్తూరు జిల్లా భాకరపేట సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో చనిపోయిన 9 మంది కుటుంబాలకు విషయంలో చేస్తున్నదేంటని నిలదీశారు. అప్పుడు రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాడ్ చేసిన జగన్.. ఇప్పుడు రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా ఇచ్చి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. తాము కొత్త డిమాండ్లు ఏమీ పెట్టడం లేదని.. ఆ నాడు జగన్ ఇచ్చిన హామీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు 'నాడు-నేడు' పేరిట జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన ఓ వీడియోను లోకేశ్ విడుదల చేశారు.
నాడు 20 లక్షలు ఇవ్వాలన్న జగన్.. నేడు 2 లక్షలు ఇవ్వడమేంటి? : లోకేశ్ - ఏపీ తాజా వార్తలు
సీఎం జగన్ మాటలు కోటలు దాటుతాయేకానీ.. ఆయన చేతలు తాడేపల్లి ప్యాలెస్ కూడా దాటవని తెదేపా జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. చిత్తూరు జిల్లా బస్సు ప్రమాదంలో మరణించినవారికి రూ.2 లక్షలు ఇచ్చి చేతులు దులిపేసుకున్నారని ఆరోపించారు.
సీఎం జగన్పై నారా లోకేశ్ ఆగ్రహం