ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 1, 2021, 5:54 PM IST

ETV Bharat / city

'బరాబర్ భాజపాలోకి పోతా.. కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి ప్రకటన '

తిరుమల వెంకన్న సాక్షిగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి తమ భవిష్యత్​ కార్యచరణ ప్రకటించారు. రానున్న రోజుల్లో భాజపాలో చేరనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. రాష్ట్రంలో భాజపా ఎదుగుతుందని నమ్మిన తొలి వ్యక్తిని తానే అని అన్నారు. తన సోదరుడు వెంకట్​రెడ్డి మాత్రం కాంగ్రెస్​లోనే ఉంటారని స్పష్టం చేశారు.

komatireddy rajagopal reddy announced to join bjp
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి

నూతన సంవత్సరం తొలిరోజే కాంగ్రెస్​ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి భాజపాలో చేరుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాజగోపాల్​రెడ్డి అనంతరం ఈ ప్రకటన చేశారు.

2019లో కాంగ్రెస్ శాసనసభ్యుడిగా ఒక ప్రకటన చేశాను. రాష్ట్రంలో భాజపా ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని నేను ప్రకటించాను. కాంగ్రెస్​ ఎమ్మెల్యేగా ఉంటూ ఆనాడే నా అభిప్రాయాన్ని వెల్లడించాను. జాతీయ స్థాయిలో పార్టీ బలహీనపడటం, రాష్ట్రంలో ఎమ్మెల్యేలు తెరాసలో చేరడం లాంటి పరిణామాల మధ్య ఆ ప్రకటన చేశా. అదే ప్రకటనకు కట్టుబడి ఉన్నా. ఆ తర్వాత ఎక్కడా కూడా కాంగ్రెస్​ పార్టీ కార్యక్రమాల్లో నేను పాల్గొనలేదు. నా సోదరుడు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి పీసీసీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వారు ఎంత వరకు సఫలం అవుతారనేది కాలమే నిర్ణయిస్తుంది. కోమటిరెడ్డి బ్రదర్స్ భాజపాలో చేరే అవకాశం లేదు. కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి భాజపాలో చేరే అవకాశం ఉంది. కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి కాంగ్రెస్​లోనే కొనసాగుతారు. తమ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను. దుబ్బాక, హుజూర్​నగర్​, జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో ప్రజలందరూ భాజపానే ప్రత్యామ్నాయంగా భావించారు. నా నిర్ణయంలో మార్పు ఉండదు. కుటుంబసభ్యులుగా మేము కలిసే ఉంటాం.- కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే.

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి

ఇవీ చూడండి:2022 నాటికి అర్హులందరికీ ఇళ్లు కట్టిస్తాం : సీఎం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details