ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: రేపే పోలింగ్ ....పుర ఎన్నికలకు సర్వం సిద్ధం

ఒక్క టెండర్ ఓటు పడినా అక్కడ రీపోలింగ్ నిర్వహిస్తామని తెలంగాణా రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి పోలింగ్ నిర్వహిస్తున్నామన్న ఎస్ఈసీ... ప్రతి ఒక్కరూ విధిగా తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఎన్నికల్లో ధన ప్రవాహం లేకుండా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ఇతరులు మరింత చురుకైన పాత్ర పోషించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కోరారు.

By

Published : Jan 21, 2020, 10:50 PM IST

రేపే పోలింగ్ ....పుర ఎన్నికలకు సర్వం సిద్ధం
muncipal-polling-in-telangana

రేపే పోలింగ్ ....పుర ఎన్నికలకు సర్వం సిద్ధం

రేపు జరగనున్న పురపాలక ఎన్నికల పోలింగ్ కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలంగాణా రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరుగుతుందని... ఓటింగ్ సాఫీగా సాగేలా అవసరమైన చర్యలు తీసుకున్నట్లు వివరించింది. తొమ్మిది నగర పాలకసంస్థల్లోని 324 డివిజన్లు, 120 పురపాలక సంస్థల్లోని 2,647 వార్డులకు పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపింది. కార్పొరేషన్లలో 1,746 మంది, మున్సిపాలిటీల్లో 11,099 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 12,845 మంది అభ్యర్థులు రేపటి పోలింగ్​లో ప్రజల తీర్పు కోరనున్నారు. ఇందుకోసం నగరపాలక సంస్థల్లో 1,438, పురపాలక సంస్థల్లో 6,188 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

కొంపల్లిలో ప్రయోగాత్మకంగా...

కార్పొరేషన్లలో 13లక్షల13వేల 909 మంది, మున్సిపాలిటీల్లో 40 లక్షల 36వేల 346 మంది ఓటర్లున్నారు. కరీంనగర్​ను మినహాయిస్తే 50 లక్షలకు పైగా ఓటర్లు రేపు ఓటుహక్కు వినియోగించుకోవాల్సి ఉంది. పోలింగ్ కోసం 45వేల సిబ్బందిని వినియోగిస్తున్నారు. 50వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. 2,406 పోలింగ్ కేంద్రాల్లో వెబ్​కాస్టింగ్, 2,072 చోట్ల వీడియోగ్రఫీ ఏర్పాట్లు చేశారు. 2,053 పోలింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను నియమించారు. ఓటర్ల గుర్తింపు కోసం కొంపల్లి పురపాలిక పరిధిలోని పది పోలింగ్ కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా ఫేసియల్ రికగ్నైజేషన్ యాప్​ను ఉపయోగిస్తున్నారు.

డబీర్​పురా డివిజన్​లోనూ...

జీహెచ్ఎంసీ పరిధిలోని డబీర్ పురా డివిజన్​లోనూ ఉప ఎన్నికల పోలింగ్ రేపే జరగనుంది. అక్కడ 50వేల 275 మంది ఓటర్లు ఉండగా... 66 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ వెబ్ కాస్టింగ్ చేయనున్నారు.

ఇవీ చూడండి: ఒక్క టెండర్ ఓటు నమోదైనా రీపోలింగ్: నాగిరెడ్డి

ABOUT THE AUTHOR

...view details