బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు అప్రమత్తంగా ఉండాలని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా మున్సిపల్ కమిషనర్లతో మంత్రి మాట్లాడారు. అధికారులంతా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని సూచించారు. రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నందున అధికారులంతా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో అన్ని చోట్ల కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
'వర్షాలకు అప్రమత్తంగా ఉండాలి.. అన్ని చోట్ల కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయండి' - weather in ap
రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నందున అధికారులంతా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో అన్ని చోట్ల కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. వర్షాల అనంతరం అంటు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.
muncipal minister botsa sathyanarayana review on rains in andhra pradesh
లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. వర్షాలు, లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు వచ్చే అవకాశాలున్నందున ముందస్తు ఏర్పాట్లు, సహాయ కార్యక్రమాలకు వార్డు సచివాలయ ఉద్యోగులను భాగస్వాములను చేయాల్సిందిగా మంత్రి సూచించారు. వర్షాల అనంతరం అంటు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇదీ చదవండి: