ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 9, 2021, 11:02 AM IST

Updated : Jul 9, 2021, 12:00 PM IST

ETV Bharat / city

కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కలిసిన ఎంపీ విజయసాయిరెడ్డి

రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అనుమతులు ఇవ్వాలని కోరుతూ కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను ఎంపీ విజయసాయిరెడ్డి కలిశారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు చేపడుతోందని విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు.

mp viajasai reddy visit minister gajendhra sing shekavath
mp viajasai reddy visit minister gajendhra sing shekavath

ఎంపీ విజయసాయిరెడ్డి

కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను ఎంపీ విజయసాయిరెడ్డి కలిశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు చేపడుతోందని విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు. తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టుల నిర్మాణాలు నిలుపుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. కేఆర్‌ఎంబీని నోటిఫై చేయాలని కోరారు.

స్పీకర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు..

'నిన్న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశాం. రఘురామపై అనర్హత వేటు వేయాలని మరోసారి కోరాం. సీఎం, పార్టీ నేతలపై రఘురామ వ్యాఖ్యలను వివరించాం. రఘురామపై తక్షణమే అనర్హత వేటు వేయాలని కోరాం. స్పీకర్ చర్యలు తీసుకోకపోతే పార్లమెంటు వేదికగా నిరసన తెలుపుతాం. స్పీకర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నట్లు ఉంది. ఏడాది గడుస్తున్నా అనర్హత పిటిషన్‌పై నిర్ణయం తీసుకోలేదు. సుప్రీం తీర్పు ప్రకారం అనర్హత పిటిషన్‌పై నిర్ణయం ఆలస్యం చేయకూడదు."-ఎంపీ విజయసాయి రెడ్డి

ఇదీ చదవండి:

అందుకే పొరుగు రాష్ట్రాల రాజకీయాల్లో జోక్యం చేసుకోవట్లేదు: జగన్

Last Updated : Jul 9, 2021, 12:00 PM IST

ABOUT THE AUTHOR

...view details