తన అరెస్టు విషయంలో పోలీసులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ ఎంపీ రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మాదాపూర్ ఏసీపీ ఎన్.శ్యాం ప్రసాద్‌రావు, నార్సింగి ఇన్స్పెక్టర్ గంగాధర్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు. డ్రోన్‌తో చిత్రీకరించారన్న ఆరోపణలపై తనపై నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు తెలియగానే.. స్వయంగా వెళ్లి 41ఏ నోటీసు ఇస్తే వివరణ ఇస్తానని కోరినట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అయినా నోటీసు ఇవ్వకుండా.. ఎంపీగా పార్లమెంటు సమావేశాల్లో హాజరుకావల్సి ఉన్నప్పటికీ అరెస్టు చేశారని ఆరోపించారు.
జైలుకు పంపించే ఉద్దేశంతో తనకు సంబంధం లేని కేసులను కూడా రిమాండ్ నివేదికలో ప్రస్తావించారన్నారు. ఏడేళ్లలోపు శిక్ష ఉండే కేసుల్లో 41ఏ నోటీసు ఇచ్చిన తర్వాత.. అవసరమైతే అరెస్టు చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించారని పిటిషన్లో పేర్కొన్నారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టును కోరారు.
అసలు ఏం జరిగింది..