ఆంధ్రప్రదేశ్

andhra pradesh

mp revanth reddy: పెట్రోల్, డీజిల్​ను జీఎస్టీ పరిధిలోకి ఎందుకు తీసుకురావడం లేదు?

By

Published : Jun 11, 2021, 4:59 PM IST

పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను నిరసిస్తూ ఏఐసీసీ (Aicc) పిలుపు మేరకు మేడ్చల్ జిల్లా ఘట్​కేసర్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాకు మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి (Revanth reddy) హాజరయ్యారు. వరంగల్-హైదరాబాద్ రహదారిపై భారత్ పెట్రోలియం బంక్ వద్ద ఆయన బైఠాయించారు

Petrol price hike in india
mp revanth reddy

ఎంపీ రేవంత్ రెడ్డి

ప్రజా రవాణాపై 34 నుంచి 60 శాతం జీఎస్టీ వేస్తున్న కేంద్రం.. విమానాల్లో ప్రయాణించే పెట్టుబడిదారులకు మాత్రం 3 శాతం పన్ను విధించడం ఏంటని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి (Revanth reddy) ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టి పేదల పక్షాన లేకపోవడం వల్ల ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు‌ నిరసిస్తూ అన్ని వర్గాలు నడుం బిగించి రోడ్లపైకొచ్చి బంద్​లకు పిలుపు ఇవ్వాలని కోరారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను నిరసిస్తూ ఏఐసీసీ(Aicc)పిలుపు మేరకు మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాకు ఆయన హాజరయ్యారు. వరంగల్- హైదరాబాద్ రహదారిపై భారత్ పెట్రోలియం బంక్ వద్ద బైఠాయించారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు తరలివచ్చారు.

మోదీ సర్కారుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఒకే దేశం-ఒకే విధానమైనప్పుడు గ్యాస్, పెట్రోల్, డీజిల్ జీఎస్టీ పరిధిలోకి ఎందుకు తీసుకురావడం లేదని రేవంత్ ప్రశ్నించారు. ఈ విషయంపై కిషన్ రెడ్డి, బండి సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్రాల వైఫల్యాలపై జులైలో రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేస్తామని‌ ఆయన వెల్లడించారు. అనంతరం ఎదులాబాద్ నుంచి ఘట్​కేసర్ చౌరస్తా వరకు రేవంత్ రెడ్డి (Revanth reddy) పాదయాత్ర చేశారు.

ఇదీ చూడండి:

లేడీ డాక్టర్​ పేరుతో లవ్​ ప్రపోజల్​.. 24 లక్షలు ఖల్లాస్

ABOUT THE AUTHOR

...view details