కేంద్ర హోంమంత్రి అమిత్ షాను నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు కలిశారు. రఘురామ మంగళవారం దిల్లీలోని ఆయన ఛాంబర్‌కు వెళ్లి మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రఘురామ ఆరోగ్య పరిస్థితిని అమిత్ షా అడిగి తెలుసుకున్నారు.
RRR: అమిత్‌షాను కలిసిన ఎంపీ రఘురామకృష్ణరాజు - అమిత్ షాతో ఎంపీ రఘురామ భేటీ
18:38 July 20
mp raghu ramakrishna raju
మరోవైపు, అంతకముందు దిల్లీలో మీడియాతో మాట్లాడిన రఘురామ రాజధాని పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు సీఎం జగన్, మంత్రి బొత్స వంటివారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరగలేదని సుప్రీం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. రెండేళ్లుగా పార్లమెంట్‌లో గొంతెత్తని వైకాపా ఎంపీలు ఇప్పుడు తనపై అనర్హత వేటు వేయించేందుకు మాట్లాడుతున్నారని, కానీ అది జరగదన్నారు. ప్రత్యేక హోదా కోసం సీఎం జగన్ ఆదేశిస్తే రాజీనామాలు చేయడానికి ఎంపీలు అంతా సిద్ధమే అని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి
Telangana: బీ అలర్ట్.. గాలి ద్వారా డెల్టా వేరియంట్ వ్యాప్తి: డీహెచ్ శ్రీనివాసరావు