వైకాపా నుంచి తనను బహిష్కరిస్తున్నట్లే భావిస్తున్నానని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఎంపీలతో సీఎం వీడియోకాన్ఫరెన్స్ ఉందంటూ తొమ్మిది గంటలకు ఏపీ భవన్ నుంచి ఆహ్వానం అందిందని చెప్పారు. అంతలోనే 11.11 గంటలకు మరో ఫోన్ కాల్ చేసి సమావేశానికి రావొద్దని చెప్పారని వెల్లడించారు. పార్టీతో సంబంధం లేదని...సీఎం సమావేశానికి హాజరుకావాల్సిన అవసరం లేదంటూ చెప్పారని తెలిపారు. ఈ పరిణామాలను బట్టి వైకాపా నుంచి తనని బహిష్కరించారనే భావిస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు. తనని బహిష్కరించినప్పటికీ పార్టీ జారీ చేసే విప్ ను పాటిస్తానని తెలిపారు.
'మరోసారి నాపై స్పీకర్ కు మరోసారి ఫిర్యాదు చేస్తారని భయపడుతున్నాను. పార్టీ సమీక్షకు నన్ను పిలవలేదు. పార్టీ నుంచి నన్ను బహిష్కరించారని భావిస్తున్నా. నాకు విప్ కూడా జారీ చేసే అవకాశం ఉంది. అమరావతిలోనే రాజధాని ఉంటుందని కుహనా మేధావులు అన్నారు. కానీ ప్రజలకు ఇచ్చిన హామీకి వ్యతిరేకంగా ముందుకు వెళ్లారు. మీరు మాట తప్పారు కనుక రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలి. రాజీనామా చేయాల్సిన అవసరం నాకు లేదు. ప్రస్తుతానికి నేను ఏ పార్టీలో ఉన్నానో అర్థం కావడం లేదు '- రఘురామకృష్ణంరాజు, ఎంపీ