ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Mopidevi On chandrababu: "పాదయాత్ర చేసింది చంద్రబాబు బినామీలే" - చంద్రబాబుపై ఎంపీ మోపిదేవి ఫైర్

MP Mopidevi Fires On chandrababu: తెదేపా అధినేత చంద్రబాబుపై.. వైకాపా ఎంపీ మోపిదేవి విమర్శలు గుప్పించారు. ప్రాంతాల మధ్య అసమానతలు సృష్టించేందుకు చూస్తున్నారని ఆరోపించారు. పాదయాత్ర చేసింది చంద్రబాబు బినామీలేనని వ్యాఖ్యానించారు. ఎంపీ పదవికి రఘురామకృష్ణరాజు రాజీనామా చేసి గెలవాలని సవాల్ విసిరారు.

mp mopidevi fires on chandrababu
mp mopidevi fires on chandrababu

By

Published : Dec 19, 2021, 7:11 PM IST

MP Mopidevi Fires On chandrababu: ఫిరాయింపుల సంస్కృతికి తెలుగుదేశం పార్టీ అడ్డా అని ఎంపీ మోపిదేవి ఆరోపించారు. ప్రాంతాల మధ్య అసమానతలు సృష్టించేందుకు చంద్రబాబు చూస్తున్నారని విమర్శించారు. మారుమూల ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశ్యంతో సీఎం జగన్ పరిపాలన వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. స్వప్రయోజనాల కోసం చంద్రబాబు అమరావతిని వ్యాపార కేంద్రంగా మార్చారని ఆరోపించారు. రాజధాని పేరుతో పాదయాత్ర చేసింది చంద్రబాబు బినామీలు, తెదేపా కార్యకర్తలు, రియల్ ఎస్టేట్​ వ్యాపారులేనని మోపిదేవి ఆరోపించారు.

రఘురామ రాజీనామా చేసి గెలవాలి..
MP Mopidevi Fires On RaghuRama: తిరుపతి సభలో ఎంపీ రఘరామ మాట్లాడిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. వైకాపా గుర్తుతో గెలిచి.. అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలన్న జగన్ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడటం సరికాదన్నారు. పార్టీ బహిష్కరించిన వ్యక్తి రఘరామరాజు అన్న ఆయన.. రాజీనామా చేసి స్వతంత్రంగా గెలవాలని సవాల్ విసిరారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాల్లో అస్త్రంగా మారొద్దని సూచించారు. పరిపాలనలో ఏపీ.. దేశానికి ఆదర్శంగా ఉందన్నారు.

ABOUT THE AUTHOR

...view details