ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 4, 2020, 3:09 PM IST

ETV Bharat / city

కేంద్రమంత్రి హర్‌దీప్‌సింగ్‌ పూరికి ఎంపీ గల్లా జయదేవ్ లేఖ

కేంద్రమంత్రి హర్‌దీప్‌సింగ్‌ పూరికి తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ లేఖ రాశారు. గుంటూరులో భూగర్భ మురుగు నీటి వ్యవస్థ పనులు నిలిపివేశారని పేర్కొన్నారు. సీఎంగా జగన్ వచ్చాక మొత్తం పనులు ఆపేశారని ఫిర్యాదు చేశారు. పనులను నిలిపివేయటంపై వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు.

mp galla jayadev letter to the union minister
mp galla jayadev letter to the union minister

కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పూరికి తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ లేఖ రాశారు. గుంటూరులో భూగర్భ మురుగు నీటి వ్యవస్థ పనులు నిలిపివేశారని తెలిపారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా వెంకయ్యనాయుడు రూ.500 కోట్లు కేటాయించారని గుర్తు చేశారు. అదే రీతిలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు విడుదల చేసిందన్నారు. 2019 జులై వరకు 50 శాతం పనులను షాపూర్‌జీ పల్లోంజీ సంస్థ పూర్తి చేసిందని వివరించారు. ముఖ్యమంత్రిగా జగన్‌ వచ్చాక మొత్తం పనులు నిలిపివేశారని పేర్కొన్నారు. గత నెల 23నాటి సమావేశంలో పనులు నిలిపివేశారన్న విషయం పూర్తిస్థాయిలో తెలిసిందన్నారు. పనులు చేపట్టిన నిర్మాణ సంస్థ కూడా గుంటూరు నుంచి వెళ్లిపోయిందని లేఖలో ప్రస్తావించారు. భూగర్భ మురుగు నీటి ప్రాజెక్టు పనులు నిలిపివేయడంపై వెంటనే జోక్యం చేసుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు.

కేంద్రమంత్రికి ఎంపీ గల్లా జయదేవ్ లేఖ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details