ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 22, 2020, 9:54 AM IST

ETV Bharat / city

సిట్ కాదు.. సీబీఐతో విచారణ జరిపించండి: ఎంపీ గల్లా

గత ప్రభుత్వ నిర్ణయాలపై.. సిట్ కాకపోతో మరిన్ని విచారణ కమిటీలు వేసినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. ప్రభుత్వం వేసిన సిట్.. కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని ఆరోపించారు. వెలగపూడిలో 24 గంటల నిరహారదీక్ష చేపట్టిన మహిళలకు గల్లా మద్దతు తెలిపారు.

mp-galla-jayadev-comments-on-sit
mp-galla-jayadev-comments-on-sit

సీబీఐతో విచారణ జరిపించండి:ఎంపీ గల్లా

రాజధాని పరిధిలో ఇన్​సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై వేసిన సిట్​కు భయపడే ప్రసక్తే లేదని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ స్పష్టం చేశారు. సిట్ కాకపోతే మరిన్ని విచారణ కమిటీలు వేసినా.. తమకు ఎటువంటి అభ్యంతరం లేదని అన్నారు. ప్రభుత్వం వేసిన సిట్ కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసమేనని ఆరోపించారు. ప్రభుత్వం చెప్పినట్లు వినే పోలీసులతో ఏర్పాటు చేసిన సిట్ కు విశ్వసనీయత ఉండదని అన్నారు. నిజంగా అవినీతి జరిగి ఉంటే సీబీఐ లాంటి సంస్థతో విచారణ జరిపించుకోవాలని సూచించారు. వెలగపూడిలో 24 గంటల నిరాహారదీక్ష చేపట్టిన మహిళలకు గల్లా మద్దతు తెలిపారు.

సిట్టింగ్ జడ్జితో విచారించండి..

ఐదేళ్ల ప్రభుత్వ పాలనపై సిట్ వేయటం విడ్డూరంగా ఉందని మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ మండిపడ్డారు. అక్రమాలు జరిగి ఉంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పోలీసులతో అయితే ఇష్టానుసారం నివేదిక రాయించుకోవచ్చన్న ఆలోచనతోనే ప్రభుత్వం సిట్ వేసిందని ఆరోపించారు.

ఇదీ చదవండి :

గత ప్రభుత్వ నిర్ణయాలపై దర్యాప్తునకు సిట్​ ఏర్పాటు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details