ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: సర్పదోషం ఉందంటూ చిన్నారిని చంపిన కన్న తల్లి - సూర్యాపేట జిల్లా తాజా వార్తలు

సూర్యాపేట జిల్లా మోతె మండలంలో దారుణం చోటు చేసుకుంది. తన కూతురుకి నాగసర్ప దోషం ఉందంటూ దొంగబాబా చెప్పిన మాటలు విని ఆరు నెలల చిన్నారిని హతమార్చింది... ఓ కన్న తల్లి. దేవుడి చిత్రాలను పాప ముందుంచి అతికిరాతకంగా కత్తితో గొంతుకోసి చంపింది.

mother killed her child
చిన్నారిని చంపిన కన్న తల్లి

By

Published : Apr 16, 2021, 9:08 AM IST

నాగసర్పదోషం ఉందని కన్న బిడ్డనే అతి కిరాతకంగా చంపింది ఓ తల్లి. సూర్యాపేట జిల్లా మోతె మండలం మేకలపాటితండాకు చెందిన బానోతు భారతి అనే మహిళ ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. తన ఆరు నెలల చిన్నారికి దోషం ఉందంటూ ఓ దొంగబాబా చెప్పిన మాయమాటలు నమ్మి.. పేగు బంధాన్ని తెంచుకుంది. భర్త ఇంట్లో లేని సమయంలో కన్న కూతురుని జాలి లేకుండా దేవుడి చిత్రాలను పాప ముందు ఉంచి పూజలు నిర్వహించింది.

చిన్నారిని చంపిన కన్న తల్లి

అనంతరం కత్తితో గొంతు కోసి అతి కిరాతకంగా హత్య చేసింది. బిడ్డను హతమార్చిన అనంతరం తనే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తమకు చెప్పిందని స్థానికులు తెలిపారు. కొంత కాలంగా భారతికి మతిస్తిమితం సరిగా ఉండడం లేదని చెబుతున్నారు. ఆరు నెలలుగా ఓ బాబా మాటలు నమ్మి ఆయన చెప్పినట్లుగా పూజలు చేస్తోందని అన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.


ఇదీ చదవండి:కరోనా భయంతో వృద్ధ దంపతుల బలవన్మరణం?

ABOUT THE AUTHOR

...view details