తెలంగాణలోని వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రంలోని ఓ ఏటీంలో రూ.100 డ్రా చేస్తే 500 వచ్చాయి. రూ.వెయ్యి డ్రా చేస్తే రూ.5 వేలుచ్చాయి. మూడు రోజులుగా ఇదే జరగుతున్నా.. అందరూ రహస్యంగా ఉంచారు. శనివారం ఉదయం ఈ విషయం తెలిసి ఏటీఎం వద్ద జనం బారులు తీరారు. లాక్డౌన్ అమల్లో ఉన్నా జనం గుంపులుగా ఎందుకున్నారని పోలీసులు ఆరా తీయగా అసలు విషయం బైట పడింది. వెంటనే ఏటీఎంను మూసేసి... నిర్వాహకులకు సమాచారం అందించారు.
సాంకేతిక లోపం కారణంగా అదనంగా డబ్బులు వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. రూ.100 నోట్ల స్థానంలో రూ.500 నోట్లు పెట్డడం వల్ల ఈ తప్పిదం జరిగినట్లుగా తెలుస్తోంది. మొత్తం రూ. 5 లక్షల 88వేలు అదనంగా డ్రా అయినట్లుగా నిర్వాహకులు చెబుతున్నారు. ఏటీఎంలో నగదు జమ చేసినప్పటి నుంచి ఏ ఖాతా నంబర్ల నుంచి డబ్బులు డ్రా చేసుకున్నారో గుర్తించి... రికవరీ చేసేలా చర్యలు తీసుకుంటామని నిర్వాహకులు తెలిపారు.