వైకాపా నాయకులు పరిపాలన మానేసి ఫ్యాక్షనిజం చేస్తున్నారని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ధ్వజమెత్తారు. అవినీతి గురించి వైకాపా నేతలు మాట్లాడుతుంటే.. దెయ్యాలు నీతులు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. గతంలో శంకుస్థాపనలు చేసినవి కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. చంద్రబాబుపై గతంలో 25 ఎంక్వైరీలు వేస్తే ఒక్కటీ నిరూపించలేకపోయారని గుర్తు చేశారు. అధికారం ఏ ఒక్కరికి శాశ్వతం కాదనే విషయాన్ని అధికార పార్టీ నేతలు గుర్తుంచుకోవాలని హితవు పలికారు.
పాలన మానేసి ఫ్యాక్షనిజం చేస్తున్నారు: బుద్దా వెంకన్న - అచ్చెన్నాయుడు అరెస్టు వార్తలు
వైకాపా పాలనపై తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో పరిపాలన మానేసి ఫ్యాక్షనిజం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
mlc buddha venkanna fiers on ycp