ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పాఠశాలల విలీనంపై ఎమ్మెల్యేల లేఖల వెల్లువ

పాఠశాలల విలీనం నిలిపివేయాలని మంత్రి బొత్స సత్యనారాయణకు 60 మంది ఎమ్మెల్యేలు లేఖలు రాశారు. స్కూళ్ల విలీనంపై ప్రజల నుంచి నిరసనలు వెల్లువెత్తున్నాయని... ఇది ఎన్నికలకు మంచిది కాదని పేర్కొన్నారు. విలీనం చేస్తామనడంతో కొందరు టీసీ ఇవ్వాలని, వేరే పాఠశాలలకు వెళ్తున్నారని తెలిపారు.

MLAs letters to minister Botsa
పాఠశాలల విలీనంపై లేఖలు

By

Published : Jul 19, 2022, 7:29 AM IST

పాఠశాలల విలీనాన్ని వ్యతిరేకిస్తూ 60 మంది పార్టీ ఎమ్మెల్యేల నుంచి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు లేఖలు వెల్లువెత్తాయి. స్థానికంగా ఇబ్బందులు వస్తున్నందున విలీనాన్ని నిలిపివేయాలంటూ వారు కోరారు. ఎన్నికల సమయంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల నుంచి తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ చాలాచోట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్న విషయం విదితమే. కొందరు వేరే బడులకు వెళ్లిపోతామని, టీసీలు ఇవ్వాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విలీనంపై సమస్యలు ఉంటే తెలియచేయాలంటూ ఎమ్మెల్యేలకు మంత్రి బొత్స సత్యనారాయణ ఇటీవల లేఖ రాశారు.

రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా అసెంబ్లీకి వస్తున్నందున ఆయా సమస్యలను లిఖిత పూర్వకంగా తెలియచేయాలంటూ పేర్కొన్నారు. దీంతో ఇక్కడకు వచ్చిన వారిలో 60మందికిపైగా ఎమ్మెల్యేలు లేఖలు ఇచ్చారు. ఒక్కో ఎమ్మెల్యే మూడు నుంచి నాలుగు పాఠశాలల వివరాలను పేర్కొన్నారు. వాటిన్నింటినీ క్రోడికరించి... ఓ నిర్ణయం తీసుకోవాలని మంత్రి బొత్స ఆలోచన చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,250 పాఠశాలలను విలీనం చేస్తుండగా.. వీటిలో 270 పాఠశాలలకు వెళ్లేందుకు వాగులు, వంకలు, రహదారులను దాటి వెళ్లాల్సి వస్తోంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details