ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మధ్య ప్రాచ్యదేశాలకు రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధిగా ఎమ్మెల్యే హఫీజ్

మధ్య ప్రాచ్యదేశాలకు.. రాష్ట్రం తరపున సహాయ ప్రత్యేక ప్రతినిధిగా.. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్​ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. మధ్య ప్రాచ్యదేశాల్లోని వ్యాపార వాణిజ్య అవకాశాలు, పెట్టుబడులను ఏపీకి తీసుకువచ్చేందుకు ప్రత్యేక ప్రతినిధులు ప్రయత్నాలు చేస్తారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

MLA Hafeez
MLA Hafeez

By

Published : Dec 26, 2020, 1:05 PM IST

కర్నూలు శాసన సభ్యుడు హఫీజ్ ఖాన్​ను మధ్య ప్రాచ్యదేశాలకు రాష్ట్రం తరపున సహాయ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఇప్పటికే పనిచేస్తున్న జుల్ఫీకి సహాయంగా హఫీజ్​ఖాన్​ను నియమిస్తున్నట్టు పేర్కొంది.

మధ్య ప్రాచ్యదేశాల్లోని వ్యాపార వాణిజ్య అవకాశాలు, పెట్టుబడులను ఏపీకి తీసుకొచ్చేందుకు ప్రత్యేక ప్రతినిధులు ప్రయత్నాలు చేస్తారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఆయా దేశాల్లోని వాణిజ్య వేత్తలు, బ్యూరో తదితరులతో సమావేశమై.. ఏపీకి పెట్టుబడులు రాబట్టడంలో ఏపీ ప్రత్యేక ప్రతినిధులు ప్రయత్నిస్తారని వెల్లడించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఉత్తర్వులు ఇచ్చారు.

ఇదీ చదవండి :కశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ముష్కరుడు హతం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details