ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గురుభక్తి చాటుకున్న ఎమ్మెల్యే - mlc election in telangana

తనకు చిన్నతనంలో చదువు నేర్పిన ఉపాధ్యాయుడిని ద్విచక్ర వాహనంపై తీసుకొచ్చి ఓటు వేయించారు తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్​. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా .. ఓటు వేయడానికి వచ్చేందుకు ఇబ్బంది పడుతున్న తన గురువును స్వయంగా ద్విచక్రవాహనంపై తీసుకొచ్చి ఓటు వేయించారు.

గురుభక్తి చాటుకున్న ఎమ్మెల్యే మెతుకు ఆనంద్
గురుభక్తి చాటుకున్న ఎమ్మెల్యే మెతుకు ఆనంద్

By

Published : Mar 15, 2021, 1:16 PM IST

గురుభక్తి చాటుకున్న ఎమ్మెల్యే మెతుకు ఆనంద్

తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గురువు భక్తిని చాటుకున్నారు. చిన్నతనంలో కెరెల్లి గ్రామంలో చదువుకునే సమయంలో తనకు విద్యాబుద్ధులు నేర్పిన కడ్యాల నర్సింములును గుర్తుపెట్టుకుని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా... తీసుకొచ్చి ఓటు వేయించారు.

వెన్నెమెుక శస్త్ర చికిత్స చేయించుకున్న తన గురువు నర్సింములు... ఓటేయడానికి వచ్చేందుకు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్న ఎమ్మెల్యే స్వయంగా ద్విచక్రవాహనంపై ఆయన్ను తీసుకొచ్చారు. ఓటు వేయించి తిరిగి ఇంటి వద్ద దింపారు. మారుమూల ఊరు నుంచి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన తన విద్యార్థి పట్ల ఆ గురువు సంతోషం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:'తాడిపత్రిలో ఆ నలుగురు ఎమ్మెల్సీలకు ఎక్స్అఫీషియో అర్హత లేదు'

ABOUT THE AUTHOR

...view details