Minor Girl Raped:తెలంగాణలోని నిజామాబాద్ జక్రాన్‌పల్లిలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పండ్లరసం కొనిస్తానని చెప్పి.. తొమ్మిదేళ్ల బాలికను తీసుకువెళ్లిన ఓ ప్రబుద్ధుడు... ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పొట్టచేత పట్టుకుని మూడ్నెళ్ల క్రితం కుమార్తెతో కలిసి జక్రాన్‌పల్లికి వచ్చిన దంపతులు శివారులో గుడిసె వేసుకుని జీవిస్తున్నారు. ఈ క్రమంలోనే భార్యా బిడ్డలను వదిలేసి భర్త వెళ్లిపోయాడు. సమీపంలో కూలీ పనులు చేసుకుంటూ ఆ మహిళ కుమార్తెను పోషించుకుంటోంది. రోజూ మాదిరిగానే ఈనెల 22న బిడ్డను ఇంట్లో వదిలేసి ఆమె పనులకు వెళ్లింది.
పండ్ల రసం కొనిస్తానని చెప్పి తీసుకెళ్లి... బాలికపై - Minor girl raped in nizamabad
Minor Raped: ఎన్ని చట్టాలొచ్చినా చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలు ఏ మాత్రం ఆగటం లేదు. పసిపాప నుంచి పండు ముదుసలి వరకూ.. మృగాళ్లు ఎవ్వరినీ వదలటం లేదు. ఇంట్లో ఒంటరిగా ఉన్న తొమ్మిదేళ్ల చిన్నారిని పండ్లరసం ఇప్పిస్తానని చెప్పి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ ప్రబుద్ధుడు. తెలంగాణలోని నిజామాబాద్ జక్రాన్‌పల్లిలో జరగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది.
minor-girl-raped-in-nizamabad-
ఇదే అదునుగా భావించిన స్థానికుడు నారాయణ పండ్ల రసం కొనిస్తానని చెప్పి... బాలికను కొండ ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. కూలీ పనుల నుంచి ఇంటికొచ్చిన తల్లి, బిడ్డ కనిపించకపోవటంతో సమీప ప్రాంతాల్లో వెతుకుతుండగా ప్రబుద్ధుడి దారుణం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు చిన్నారిని ఆస్పత్రికి తరలించారు