ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Earthquake: మూడు జిల్లాల్లో స్వల్ప భూప్రకంపనలు - పల్నాడులో స్వల్ప భూప్రకంపనలు

Earthquake: రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో.. శనివారం ఉదయం స్వల్పంగా భూమి కంపించింది. ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో.. సుమారు రెండు, మూడు సెకన్ల పాటు శబ్దాలు రావటంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.

Earthquake in three districts
మూడు జిల్లాల్లో స్వల్ప భూప్రకంపనలు

By

Published : Jun 19, 2022, 7:32 AM IST

Earthquake: ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో శనివారం ఉదయం స్వల్పంగా భూమి కంపించింది. ఉదయం సుమారు రెండు, మూడు సెకన్ల పాటు శబ్దాలు రావటంతో ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

  • ప్రకాశం జిల్లాలోని పొదిలి పట్టణం, మాదాలవారిపాలెం, కనిగిరి పట్టణం, హనుమంతునిపాడు, మర్రిపూడి మండలం దుక్కిరెడ్డిపాలెం, గొండ్ల సముద్రంలో భూమి కంపించింది.
  • బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం పరిటాలవారిపాలెం, బల్లికురవ మండలం కూకట్లపల్లిలో స్వల్ప భూ ప్రకంపనలు.
  • పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం పిచ్చుకలపాలెం తదితర గ్రామాల్లో భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. కొన్ని చోట్ల ఇళ్ల గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి.

రిక్టర్‌స్కేల్‌పై దాని ప్రభావం ఏ మేరకు నమోదైంది అనే అంశాలు ఆదివారం ప్రకటిస్తామని హైదరాబాద్‌ భూగర్భ పరిశోధనా సంస్థ అధికారులు వెల్లడించారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details