ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రూ. కోటి పరిహారం సాధ్యం కాదు..అన్ని విధాలా ఆదుకుంటాం

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం రాపర్ల వద్ద నిన్న జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేశ్ పరామర్శించారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీనిచ్చారు. కోటి రూపాయల పరిహారం ఇవ్వటం సాధ్యం కాదని చెప్పారు.

ministers-visits-oongole-rims
ministers-visits-oongole-rims

By

Published : May 15, 2020, 10:46 AM IST

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం రాపర్ల వద్ద నిన్న జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేశ్, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పరామర్శించారు. ఒంగోలు రిమ్స్​లో మృతదేహాలను మంత్రులు పరిశీలించిన అనంతరం... అక్కడ స్థానికులతో మాట్లాడారు. బాధిత కుటుంబీలకు అన్ని విధాలా ఆదుకుంటామని వెల్లడించారు. మృతులకు కోటి పరిహారం చెల్లించాలని బాధిత కుటుంబాలు, ప్రజాసంఘాల నేతలు మంత్రులను కోరాయి.

కోటి ఇవ్వడం సాధ్యంకాదు

బాధిత కుటుంబాలను అన్నివిధాలుగా ఆదుకుంటామని మంత్రి బాలినేని శ్రీనివాస్ అన్నారు. బాధిత కుటుంబాలకు భూముల పంపిణీపై పరిశీలిస్తామని చెప్పారు. విద్యుత్‌ స్తంభాల ఏర్పాటులో వైఫల్యాలపై దర్యాప్తు జరిపిస్తున్నామని తెలిపారు. ట్రాక్టర్‌లో కూలీలను తరలించడంపై ఆరా తీస్తున్నామన్నారు. ఇప్పటికే ప్రభుత్వం రూ.5 లక్షలు పరిహారం ప్రకటించిందని వివరించారు. రూ.కోటి పరిహారం కావాలని కొంతమంది అడుగుతున్నారని....విశాఖ ఘటనను దీంతో పోల్చకూడదని వ్యాఖ్యానించారు. కంపెనీ తప్పిదం కారణంగా జరిగినందున రూ.కోటి పరిహారం ఇచ్చామని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details